- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FinMin: జాయింట్ బ్యాంక్ అకౌంట్ తెరిచేందుకు ఎల్‌జీబీటీక్యూలకు ఎలాంటి అడ్డంకుల్లేవు
దిశ, బిజినెస్ బ్యూరో: ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు ఉమ్మడి బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రకటనలో స్పష్టం చేసింది. అలాగే, క్వీర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తిని నామినీగా ఎంచుకునేందుకు ఎలాంటి పరిమితులు లేవని పేర్కొంది. అంతేకాకుండా ఖాతాదారు తమ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ను తీసుకునేందుకు క్వీర్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తికి అవకాశం ఉంటుందని వివరించింది. ఈ మేరకు గురువారం ఆర్థిక మంత్రిత్వ శాఖ నోట్‌ను విడుదల చేసింది. గతంలో 2023, అక్టోబర్‌లో ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ విషయంలో మంత్రిత్వ శాఖకు బ్యాంకు ఖాతాలపై సలహాను ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి.. క్వీర్ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ సమస్యలను పరిశీలించడానికి కేంద్రం కేబినెట్ సెక్రటరీ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని 2024, ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఇదే విషయంపై ఆర్‌బీఐ ఈ ఏడాది ఆగష్టు 21న అన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులకు వివరణను జారీ చేసింది. ఇప్పటికే ఆర్‌బీఐ 2015లో థర్డ్ జెండర్ కోసం బ్యాంకు ఖాతాలు తెరవడం, సంబంధిత సేవల్లో ప్రత్యేక కాలమ్‌ను చేర్చాలని బ్యాంకులను ఆదేశించింది.