Byju's: ఉద్యోగులకు జూలై జీతాలు లేకపోవడంపై బైజూస్ రవీంద్రన్ వివరణ

by S Gopi |
Byjus: ఉద్యోగులకు జూలై జీతాలు లేకపోవడంపై బైజూస్ రవీంద్రన్ వివరణ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ మరోసారి ఉద్యోగులకు జీతాలను చెల్లించలేదు. తాజాగా జూలై నెలకు సంబంధించి జీతాలు ఇవ్వకపోవడంపై కంపెనీ వ్యవస్థాపకుడు బైజూస్ రవీంద్రన్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా వివరణ ఇచ్చారు. అనేక చట్టపరమైన సవాళ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించి వీలైనంత త్వరగా జీతాలు చెల్లించనున్నట్టు హామీ ఇచ్చారు. ప్రస్తుత బైజూస్ సంస్థ బీసీసీఐతో వివాదం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ కేసులో పరిష్కారం సాధించాం. ఎన్‌సీఎల్ఏటీ కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆర్థికంగా ఇబ్బందులు తొలగినట్టేనని, త్వరలో దీనిపై పూర్తి స్పష్టత వస్తుందని రవీంద్రన్ ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో వివరించారు. గత కొన్నివారాలుగా కపెనీపై అనేక ఆరోపణలు వచ్చాయి. నిర్లక్ష్యంగా ఉన్నామనే నిందలను కూడా ఎదుర్కొన్నాం. అయితే, తాను సంస్థ కార్యకలాపాల విషయంలో ఎప్పుడూ పారదర్శకంగా ఉంటానని, చట్టపరమైన, ఆర్థికపరమైన బాధ్యతల నుంచి ఎన్నడూ తప్పించుకునే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story