Viacom18: వయాకామ్18 బోర్డులో చేరిన నీతా, ఆకాష్ అంబానీలు

by S Gopi |
Viacom18: వయాకామ్18 బోర్డులో చేరిన నీతా, ఆకాష్ అంబానీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్, వాల్ట్ డిస్నీ ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విలీన ఒప్పందంలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాశ్ అంబానీ వయాకామ్ 18 బోర్డులో చేరారు. వారితో పాటు బోధి ట్రీ సిస్టమ్స్ సహ-యజమాని జేమ్స్ ముర్దోచ్, కతాన్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చెందిన మహ్మద్ అల్ హర్దర్ బోర్డులో చేరారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వయాకామ్, వాల్ట్ డిస్నీ స్టార్ ఇండియాతో విలీనం చివరి దశకు చేరువలో ఉన్నందున ఈ డెవలప్‌మెంట్ జరిగింది. రెండు మీడియా సంస్థలను ఏకీకృతం చేయడంలో బోర్డు పునర్నిర్మాణం కీలక పరిణామంగా ఉండనుంది. వయాకామ్, వాల్ట్ డిస్నీ విలీన ప్రతిపాదనకు ఇప్పటికే సీసీఐ, నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం తెలిపాయి. సీసీఐ ఇచ్చిన సూచనల ఆధారంగా వ్యాపార మార్పులతో విలీనం చివరి దశకు చేరుకుంది. అందుకే నీతా, ఆకాశ్ అంబానీలు బోర్డులో చేరారు. విలీన తర్వాత ఏర్పట్ కొత్త సమ్ష్తలో 120 టీవీ ఛానెళ్లతోప్ ఆటు 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉండనున్నాయి. రూ.70 వేల కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థగా ఉంటుంది.

Advertisement

Next Story