- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీతా అంబానీ చేతికి రిలయన్స్, డిస్నీ విలీన సంస్థ అధ్యక్ష బాధ్యతలు!
దిశ, బిజినెస్ బ్యూరో: వాల్డ్ డిస్నీ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేసినట్టు కథనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఇరు సంస్థల ఆస్తుల విలీనం తర్వాత బోర్డు అధ్యక్ష బాధ్యతలను నిర్వహించనున్నట్తు సమాచారం. గత కొన్ని నెలలుగా ఇరు సంస్థలు మీడియా విలీన ఒప్పందంపై సంతకం చేసే అంశంపై చర్చిస్తున్నాయని, ఈ వారంలోనే ప్రకటన కూడా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే నీతా అంబానీ ఛారిటీ బాధ్యతలను చూసుకునేందుకు రిలయన్స్ బోర్డు నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు. రిలయన్స్, డిస్నీలు చెరొక స్ట్రీమింగ్ యాప్‌లను కలిగి ఉన్నాయి. అలాగే, 120 టెలివిజన్ ఛానెల్‌లను కలిగి ఉన్నాయి. ఇరు సంస్థల మధ్య ఒప్పందం ఖరారైతే 28 బిలియన్ డాలర్లతో రిలయన్స్ భారత మీడియా రంగంలో మరింత బలోపేతం కానుంది. విలీన సంస్థలో రిలయన్స్ 51-54 శాతం మధ్య వాటాను సొంతం చేసుకోవచ్చని నివేదికలు చెబుతున్నాయి.