రూ.6 లక్షల ధరలో నిస్సాన్ కొత్త మోడల్ కారు

by Harish |   ( Updated:2023-10-10 11:50:14.0  )
రూ.6 లక్షల ధరలో నిస్సాన్ కొత్త మోడల్ కారు
X

దిశ, వెబ్‌డెస్క్: నిస్సాన్ కంపెనీ ఇండియాలో మాగ్నైట్ AMT వెర్షన్‌ కొత్త కారును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.6,49,900 (ఎక్స్-షోరూమ్). ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE,XL,XV,XV ప్రీమియంలో అందుబాటులో ఉంది. మాగ్నైట్ AMT మోడల్ 71 BHP పవర్, 96 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. దీనిలో 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌‌ను అందించారు. ఇది 19.70kmpl మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. కారులో 8 అంగుళాల టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఫోన్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, JBL స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్, భద్రత కోసం ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రైజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed