- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Stock Market: రికార్డు ర్యాలీ తర్వాత ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస రికార్డు లాభాలకు బ్రేక్ పడింది. ఆల్‌టైమ్ గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణ పెద్ద ఎత్తున జరగడంతో మంగళవారం సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోవడానికి తోడు దేశీయంగా కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ప్రధానంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లకు సంబంధించి ప్రభావితం చేసే జాబ్ డేటా, ఇతర గణాంకాలపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. గ్లోబల్ మార్కెట్లను ప్రభావితం చేసే ఇతర అంశాలు లేకపోవడం, దేశీయంగా గరిష్ఠాల వద్ద మార్కెట్లు చేరడంతో అమ్మకాలు పెరిగాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమాయానికి సెన్సెక్స్ స్వల్పంగా 4.40 పాయింట్లు క్షీణించి 82,555 వద్ద, నిఫ్టీ 1.15 పాయింట్లు లాభపడి 25,279 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, టైటాన్, నెస్లె ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.95 వద్ద ఉంది.