Adani Group: అదానీ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన మోర్గాన్ స్టాన్లీ

by Harish |
Adani Group: అదానీ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్ ఇచ్చిన మోర్గాన్ స్టాన్లీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల అమెరికా షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ నుంచి రెండో సారి ఆరోపణలు ఎదుర్కొన్న అదానీ గ్రూపుకు ఒక విషయంలో బిగ్ రిలీఫ్ లభించింది. గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (MSCI) అదానీ గ్రూప్ స్టాక్‌లపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్‌, దానికి సంబంధించిన సెక్యూరిటీల నెంబర్ షేర్ల సంఖ్య (NOS), ఫారిన్ ఇన్‌క్లూజన్ ఫ్యాక్టర్(FIF), డొమెస్టిక్ ఇన్‌క్లూజన్ ఫ్యాక్టర్(DIF) కి మార్పులు తీసుకొచ్చిన్నట్లు తెలిపింది.

పరిమితులను ఎత్తివేసినప్పటికీ, మోర్గాన్ స్టాన్లీ అదానీ గ్రూప్‌ను నిశితంగా పర్యవేక్షించడం కొనసాగిస్తుంది. ఫ్రీ ఫ్లోట్‌కు సంబంధించిన ఏవైనా పరిణామాలు తలెత్తితే తదుపరి ఉత్తర్వులను జారీ చేస్తుంది. మోర్గాన్ స్టాన్లీ ఆంక్షలను తొలగించడంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్‌తో సహా MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లోని అనేక కీలకమైన అదానీ గ్రూప్ స్టాక్‌లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే వారాల్లో అదానీ గ్రూప్‌లోకి దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్‌లు వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

Next Story