- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Morgan Stanley: సముద్రంలో గల్లంతైన మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ జోనాథన్ బ్లూమర్
దిశ, బిజినెస్ బ్యూరో: సిసిలీ తీరంలో విలాసవంతమైన బయేసియాన్ అనే పడవ సోమవారం తీవ్రమైన సుడిగాలి కారణంగా బోల్తాపడగా, ఈ ప్రమాద సమయంలో దానిలో 10 మంది సిబ్బందితో సహా మొత్తం 22 మంది ఉండగా వారిలో 15 మందిని కాపాడారు. ఈ పడవలో దిగ్గజ వ్యాపారవేత్తలు, ప్రపంచ ప్రముఖులు ఉన్నారు. ఈ ప్రమాదంలో బ్రిటీష్ టెక్ వ్యవస్థాపకుడు మైక్ లించ్‌తో పాటు మోర్గాన్ స్టాన్లీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ జోనాథన్ బ్లూమర్ గల్లంతయ్యారు. అలాగే, ఆయన సతీమణి, క్లిఫ్‌ఫోర్డ్ ఛాన్స్ లాయర్ క్రిస్ మోరవిల్లో, మైక్ లించ్ కుమార్తె హన్నా సహా ఇద్దరు వ్యక్తులు కనిపించకుండపోయారు.
ఓడకు చెందిన చెఫ్‌గా భావించిన ఓ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు. బ్రిటన్ బిల్‌గేట్స్‌గా పేరుగాంచిన మైక్ లించ్ అమెరికాలో ఓ మోసం కేసులో ఇటీవలే నిర్దోషిగా బయటపడ్డారు. దీంతో అతను వారి కోసం ట్రిప్‌ను ప్లాన్ చేయగా అనుకోకుండా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జోనాథన్ బ్లూమర్ 2018 నుండి మోర్గాన్ స్టాన్లీ యూరోపియన్ వ్యాపారానికి ఛైర్మన్‌గా ఉన్నాడు. గత సంవత్సరం బ్రిటిష్ బీమా సంస్థ హిస్కాక్స్ లిమిటెడ్ బోర్డుకి నాయకత్వం వహించాడు. ఆయన లించ్‌కి స్నేహితుడు.