SEBI: సోమవారం సెబీ భవన్ వద్ద 700 మంది ఉద్యోగులు నిరసన!

by Harish |
SEBI: సోమవారం సెబీ భవన్ వద్ద 700 మంది ఉద్యోగులు నిరసన!
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్ధ సెబీకి కొత్త తలనొప్పి వచ్చింది. దానిలో పనిచేస్తున్న A, B, C గ్రేడ్‌లకు చెందిన సుమారు 700 మంది ఉద్యోగులు సోమవారం ముంబైలోని సంస్థ ప్రధాన కార్యాలయం, సెబీ భవన్ వద్ద నిరసనకు సిద్ధమయ్యారని పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. సంస్థ నాయకత్వంపై గత రెండున్నరేళ్లుగా ఉద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తి, అలాగే, ఆర్‌బీఐ ఉద్యోగులతో సమానంగా ఉండేలా తమ అలవెన్స్‌లను మార్చడం లేదని, ఇంకా కీ రిజల్ట్ ఏరియాస్‌లను (కెఆర్‌ఎ) అప్‌లోడ్ చేయడానికి కొత్త సిస్టంను ప్రవేశపెట్టడంతో అలవెన్స్‌లు ఆగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు సెబీ భవన్ ముందు ఆందోళన చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే సెబీ తన ఉద్యోగులకు క్షమాపణలు చెబుతూ ఈమెయిల్ పంపించినప్పటికి కూడా వారంతా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేయడానికే సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed