మహిళల కోసం ప్రత్యేక మెటర్నిటీ పాలసీ తీసుకొచ్చిన మహీంద్రా!

by Vinod kumar |
మహిళల కోసం ప్రత్యేక మెటర్నిటీ పాలసీ తీసుకొచ్చిన మహీంద్రా!
X

ముంబై: దేశీయ దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం సరికొత్త మెటర్నిటీ పాలసీ తీసుకొచ్చింది. ఇది ఐదేళ్ల కాలానికి సంబంధించిన పాలసీ. ఇది సంస్థలోని పనిచేస్తున్న మహిళా కార్మికులందరికీ వర్తిస్తుందని, తయారీ కేంద్రాల్లో ఉన్న వారందరూ ఈ మెటర్నిటీ పాలసీ పరిధిలో ఉంటారని కంపెనీ వెల్లడించింది.

అంతేకాకుండా పిల్లలను దత్తత తీసుకున్నవారికి కూడా ఇది అమలవుతుందని పేర్కొంది. ఈ ఐదేళ్ల మెటర్నిటీ బెనిఫిట్ పాలసీ ద్వారా మహిళా ఉద్యోగులు వారి మాతృత్వం సమయంలో కీలకమైన మూడు దశల్లో ప్రయోజనాలు పొందనున్నారు. అవి ప్రసవానికి ముందు ఒక సంవత్సరం, ప్రసూతి సమయంలో 1 సంవత్సరం, ప్రసూతి తర్వాత 3 ఏళ్లు ఉంటుంది.

వీటిలో 6 నెలల ఫ్లెక్సిబుల్, 24 నెలలపాటు హైబ్రిడ్, 26 వారాల ప్రసూతి సెలవు ఉంటుంది. పిల్లల సంరక్షణ కోసం సెలవు కావాలనుకునే వారు ఏడాది పాటు వేతనం లేకుండా సెలవు తీసుకోవచ్చు. అయితే, ఈ సౌకర్యం కంపెనీలో 36 నెలల సర్వీస్ పూర్తి చేసిన మహిళలకు మాత్రమే ఇవ్వనున్నట్టు తెలుస్తోఒంది. సంస్థలో పనిచేస్తున్న మహిళలకు పూర్తిస్థాయిలో మద్దతివ్వడమే ఈ పాలసీ లక్ష్యమని ఎంఅండ్ఎం చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ ఆశా ఖర్గా పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed