Indian millionaires count : భారత్‌లో మిలీనియర్లు ఎంతమందో తెలుసా?

by GSrikanth |   ( Updated:2023-07-06 09:52:07.0  )
Indian millionaires count : భారత్‌లో మిలీనియర్లు ఎంతమందో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే ఏడేళ్లలో దేశంలో సంపన్నుల సంఖ్య ఐదు రేట్లు పెరుగుతుందని అదే సమయంలో మధ్య తరగతి జనాభా మరింత పెరుగుతుందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులపై పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ ఎకానమీ అండ్ ఇండియా సిటిజెన్ ఎన్విరాన్మెంట్ (ప్రైస్) అనే సంస్థ దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనం ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఏడాదికి రూ.2 కోట్ల కంటే ఎక్కువ సంపాదించే 2032 నాటికి ఐదు రేట్లు పెరిగి 91 లక్షలకు చేరుకుంటుందని పేర్కొంది. ఇది 2021 నాటికి 18 లక్షలుగా ఉందని తెలిపింది. ఇక గత ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో కోటీశ్వరుల సంఖ్య 14.2 శాతం పెరగ్గా.. ఇది పట్టణాల్లో 10.6 శాతం ఉందని నివేదిక స్పష్టం చేసింది.

సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సంపాదించే మిడిల్ క్లాస్ జనాభా వేగంగా పెరుగుతున్నది. 2031 నాటికి వీరి సంఖ్య 71.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏడాదికి రూ.1.25 లక్షల కంటే తక్కువ ఆదాయం ఆర్జించే వారి సంఖ్య సగానికి తగ్గబోతున్నదని వచ్చే దశాబ్దం నాటికి వీరి సంఖ్య 7.9కోట్లకు చేరుతుందని పేర్కొంది. గ్రామీణ ప్రాతాంత్లో ప్రజలు వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు, వ్యవసాయేతర కార్యకలాపాల్లో ఎక్కువగా నిమగ్నమవుతున్నారని, గ్రామీణ ప్రాంతాలకు కొత్త వ్యాపారవేత్తలు ఉద్యోగాలు సృష్టించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు దోహదంగా మారుతుందని ఈ సంస్థ సీఈవో రాజేష్ శుక్లా చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed