500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్

by S Gopi |
500 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మర్కెట్లు సోమవారం ట్రేడింగ్‌లో అధిక నష్టాలను ఎదుర్కొన్నాయి. కీలక కంపెనీల షేర్లలో అమ్మకాల ఒత్తిడికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, ర్యాలీకి మద్దతిచ్చే అంశాలు లేకపోవడంతో సూచీలు బలహీనపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్‌లలో లాభాల స్వీకరణ మార్కెట్ల నష్టాలకు కారణమయ్యాయి. ప్రధానంగా కీలక బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో మదుపర్లు అమ్మకాలను పెంచారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్లు పతనమై 71,072 వద్ద, నిఫ్టీ 166.45 పాయింట్లు నష్టపోయి 21,616 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్ రంగాలు మాత్రమే రాణించాయి. మిగిలిన రంగాలన్నీ కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో విప్రో, హెచ్‌సీఎల్ టెక్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లె ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టాటా స్టీల్, ఎన్‌టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐటీసీ, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, పవర్‌గ్రిడ్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.01 వద్ద ఉంది.

Advertisement

Next Story