ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుండి 33 మిలియన్ల పోస్ట్‌లను తొలగించిన మెటా

by Harish |
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుండి 33 మిలియన్ల పోస్ట్‌లను తొలగించిన మెటా
X

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఏప్రిల్ 2023లో యూజర్ల నుంచి వచ్చిన 54 శాతానికి పైగా ఫిర్యాదులను, ఇన్‌స్టాగ్రామ్ నుంచి వచ్చిన 41 శాతం ఫిర్యాదుల పట్ల చర్యలు తీసుకున్నట్లు మెటా ఇండియా మంత్లీ రిపోర్ట్‌లో తెలిపింది. బెదిరింపు/ లైంగిక కంటెంట్, నగ్నత్వం, నకిలీ ప్రొఫైల్‌‌లు మొదలగు అంశాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదుల పట్ల చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఫేస్‌బుక్ వినియోగదారుల నుండి మొత్తం 8,470 ఫిర్యాదులు రాగా, వాటిలో 2,225 కేసులలో సమస్యలను పరిష్కారం కోసం సహాయం అందించారు. మిగిలిన 6,245 నివేదికలలో పూర్తి సమీక్ష తర్వాత 1,244 నివేదికలపై చర్య తీసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ నుంచి 9,676 ఫిర్యాదులు రాగా, అందులో 5,255 సంఘటనలపై సమీక్షించగా 1,664 నివేదికలపై చర్య తీసుకున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండింటిలో కలిపి మొత్తంగా 33.18 మిలియన్ల పోస్ట్‌లను తోలగించారు.

Advertisement

Next Story