Meesho: పండుగ సీజన్ కోసం 8.5 లక్షల మందిని నియమించుకున్న మీషో

by S Gopi |
Meesho: పండుగ సీజన్ కోసం 8.5 లక్షల మందిని నియమించుకున్న మీషో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఈ-కామర్స్ కంపెనీలు ఆఫర్లతో పాటు డెలివరీ సేవల కోసం చర్యలు మొదలుపెట్టాయి. తాజాగా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ మీషో సైతం పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసుకుంటున్నట్టు గురువారం ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా విక్రయాలు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో సేవలను మెరుగుపరిచేందుకు 8.5 లక్షల సీజనల్ ఉద్యోగాలను సృష్టిస్తున్నట్టు పేర్కొంది. వీటిలో అత్యధికంగా టైర్-3, టైర్-4 ప్రాంతాల్లో ఉంటాయని మీషో తెలిపింది. ఆయా ప్రాంతాల్లో చిన్న, స్థానిక వ్యాపారులు, లాజిస్టిక్ వర్గాల వృద్ధికి, వారి ఆర్థిక అవకాశాలను అందించేందుకు కొత్త నియామకాలు ఉపయోగపడతాయని మీషో ఫుల్‌ఫిల్‌మెంట్ అండ్ ఎక్స్‌పీరియన్ హెడ్ సౌరభ్ పాండే చెప్పారు. కంపెనీ వివరాల ప్రకారం, గతేడాదితో పోలిస్తే పండుగ సీజన్‌కు మీషో నియామకాలు 70 శాతం పెరిగాయి. పండుగ సీజన్‌కు తీసుకున్న ఉద్యోగులు ఎక్కువగా ఫస్ట్-మైల్, మిడిల్-మైల్, డెలివరీ అసోసియేట్‌లు, పికింగ్ సహా వివిధ విభాగాల్లో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story