- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరికొత్త ఆల్టో కె10 కారును విడుదల చేసిన మారుతి సుజుకి!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మోడల్ ఆల్టో కె10ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు కోసం ఇప్పటికే రూ. 11,000 ధరతో ప్రీ-బుకింగ్ సౌకర్యాన్ని కంపెనీ ప్రారంభించింది. దేశీయ వాహన మార్కెట్లో కంపెనీ ఇప్పటివరకు 40 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించగా, వీటిలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా ఆల్టో ఉందని కంపెనీ పేర్కొంది.
ఆరు వేరియంట్లలో లభించే కారు మోడల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 3.99 లక్షల నుంచి రూ. 5.33 లక్షల్లో అందుబాటులో ఉందని, రెండు ఆటో వేరియంట్ ధరలు రూ. 5.49 లక్షల నుంచి రూ. 5.83 లక్షలకు లభిస్తుందని కంపెనీ తెలిపింది. సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్ వంటి ఆరు రంగల్లో అందుబాటులో ఉంది. 800సీసీ ఇంజన్‌తో వస్తున్న ఈ కారు 24.9 కిలోఈటర్ల మైలేజీని ఇస్తుంది.
ప్రధానంగా భద్రతకు సంబంధించి ఆల్టో కె10లో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్‌తో పాటు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై-స్పీడ్ అలర్ట్ లాంటివి ఉన్నాయి. కొత్త ఆల్టో డిజైన్ పాత మోడళ్లకు భిన్నంగా ఉంటుంది. దీని కొలతల్లో మార్పులు చేశామని, ఇదివరకు ఉన్న దానికంటే పొడవు ఉంటుందని, అధిక లెగ్, హెడ్‌రూమ్‌ను అందిస్తున్నట్టు కంపెనీ వివరించింది.