Maruti Suzuki: ఆరేళ్లలో కొత్తగా 3,000 షోరూమ్‌ల ఏర్పాటు: మారుతీ సుజుకి

by S Gopi |
Maruti Suzuki: ఆరేళ్లలో కొత్తగా 3,000 షోరూమ్‌ల ఏర్పాటు: మారుతీ సుజుకి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి కస్టమర్లకు మరింత చేరువ కావడానికి భారీ సంఖ్యలో సర్వీస్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. దీనికోసం 2030-31 నాటికి కొత్తగా 3,000 టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం కంపెనీ తన ప్రీమియం రిటైల్ ఔట్‌లెట్ నెక్సాకు చెందిన 500వ షోరూమ్‌ను ప్రారంభించింది. దీంతో కంపెనీ ప్రస్తుతం నెక్సాతో పాటు అరెనా ఔట్‌లెట్‌ల సంఖ్య 5,240కు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. కస్టమర్లకు సులభంగా, మెరుగైన సేవలందించేందుకు, వారికి మరింత చేరువ అయ్యేందుకు కొత్త షోరూమ్‌లు ఉపయోగపడతాయని మారుతీ సుజుకి ఇండియా ఎండీ, సీఈఓ హిసాషి టెకుచి అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇటీవల వార్షిక ఉత్పత్తిని గణనీయంగా పెంచాం. అందుకు అనుగుణంగా సర్వీస్ నెట్‌వర్క్‌ను పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం వచ్చే ఆరేళ్లలో 8,000కి పైగా సర్వీస్ నెట్‌వర్క్ పాయింట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. తొలిసారిగా 2017, జూలైలో మారుతీ సుజుకి తన మొదటి నెక్సా సర్వీస్ వర్క్‌షాప్‌ను ప్రారంభించింది. ఈ 7 ఏళ్ల ఐదు నెలల తర్వాత 500వ టచ్‌పాయింట్‌ను ప్రారంభించినట్టు కంపెనీ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed