వాహన పరిశ్రమలో కొనసాగుతున్న సెమీకండక్టర్ల కొరత!

by Vinod kumar |
వాహన పరిశ్రమలో కొనసాగుతున్న సెమీకండక్టర్ల కొరత!
X

న్యూఢిల్లీ:దేశీయ వాహన పరిశ్రమలో సెమీకండక్టర్ల కొరత మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగుతుందని అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి తెలిపింది.ప్రస్తుతానికి తమ వద్ద 3.69 లక్షల యూనిట్ల బుకింగ్‌లను పెండింగ్‌లో ఉన్నాయని, అత్యధీకంగా ఎర్టిగా మోడల్ కోసం 94 వేల ఆర్డర్లు అందాయని కంపెనీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. దీని తర్వాత గ్రాండ్ విటారాకు 37 వేలు, బ్రెజాకు 61,500, జిమ్నీ 22 వేలు, ఫ్రాంక్స్ 12 వేల బుకింగ్‌లు వచ్చాయని ఆయన తెలిపారు. చిప్‌ల కొరత వల్ల అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 46 వేల యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయాం.

ప్రస్తుత త్రైమాసికంలోనూ ఉత్పత్తిపై ప్రభావం ఉందని, ఈ నేపథ్యంలో మరికొన్ని త్రైమాసికాల వరకు సెమీకండక్టర్ల కొరత ఉంటుందని భావిస్తున్నట్టు శశాంక్ వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సెమీకండకర్ల కొరత ఎప్పటికి తీరుతుందో అంచనా వేయలేమని ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా ప్యాసింజర్ మార్కెట్లో స్పోర్ట్స్ యుటిలిటీ విభాగంలో తాము 42.6 శాతం వాటాతో ముందంజలో ఉన్నామని, హ్యాచ్‌బ్యాక్ విభాగంలో 35 శాతం వాటాను కలిగి ఉన్నామని శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఇటీవల వడ్డీ రేట్పు పెరగడంతో పరిశ్రమలో డిమాండ్‌పై కొంత ప్రభావం ఉందనేది వాస్తవం. అయితే, ఆర్థికవ్యవస్థ వృద్ధి కొనసాగితే ఆ ప్రభావం తగ్గిపోవచ్చని, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయం పెరగడం పరిశ్రమకు సానుకూల పరిణామామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story