- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రికార్డు స్థాయిలో 1,00,000 అమ్మకాలను దాటిన మారుతీ Fronx మోడల్
దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతీ సుజుకి ఇండియా తన Fronx(ఫ్రాంక్స్) మోడల్ అమ్మకాలలో కీలక మైలురాయికి చేరుకుంది. Fronx మోడల్ విడుదల చేసిన 10 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో దాదాపు 1 లక్ష కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసినట్లు తాజాగా ప్రకటించింది. ఈ మోడల్‌ను కంపెనీ ఏప్రిల్ 24, 2023న ఇండియా మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం 10 నెలల్లో 1 లక్ష కంటే ఎక్కువ అమ్మకాలను జరిపి ఇండస్ట్రీ రికార్డుగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.
సెమీకండక్టర్ కొరత ఉన్నప్పటికీ కూడా కస్టమర్లకు సమయానికి డెలివరీ చేశామని, ఈ మోడల్ కస్టమర్లలో ఎక్కువగా 35 ఏళ్ల లోపు వారే ఎక్కువగా ఉన్నారని కంపెనీ తెలిపింది. Fronx ప్రస్తుతం SUV మార్కెట్లో 12 శాతం వాటాను కలిగి ఉంది. ప్రారంభంలో మార్కెట్ వాటా 17 ఉండగా, ఇది 30 శాతానికి చేరుకుంది. ఇప్పటి వరకు కంపెనీ దాదాపు 9,000 యూనిట్ల Fronx మోడళ్లను లాటిన్ అమెరికన్, ఆఫ్రికన్ మార్కెట్‌లకు ఎగుమతి చేసింది. అలాగే, బాలెనో మోడల్ అమ్మకాలు కూడా ఐదు శాతానికి పైగా పెరిగాయని అధికారులు పేర్కొన్నారు.