మూడు నెలల గరిష్ఠానికి తయారీ పీఎంఐ!

by Hamsa |   ( Updated:2023-04-03 13:29:25.0  )
మూడు నెలల గరిష్ఠానికి తయారీ పీఎంఐ!
X

న్యూఢిల్లీ: భారత తయారీ రంగ కార్యకలాపాలు మార్చిలో పుంజుకున్నాయి. ఇన్‌పుట్ ఖర్చులు తగ్గడం, ఉత్పత్తి పెరగడంతో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ సూచీ (పీఎంఐ) 2023, మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయి 56.4 పాయింట్లకు పెరిగిందని సర్వే తెలిపింది. అంతకుముందు ఫిబ్రవరిలో ఇది 55.3 పాయింట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెమ్మదించడం, ముడిసరుకు లభ్యత మెరుగుపడటం, ఇన్‌పుట్ ఖర్చులు రెండేళ్లలోనే కనిష్టానికి రావడం, వస్తు తయారీదారులు తమ స్టాక్‌లపై దృష్టి సారించడం వల్లనే తయారీ పీఎంఐ పెరిగిందని ఎస్అండ్‌పీ గ్లోబల్ ఇండియా వెల్లడించింది. 'మార్చిలో దేశీయంగా డిమాండ్ బలంగా ఉంది.

మూడు నెలలుగా ఫ్యాక్టరీ ఆర్డరు వేగంగా పెరగడం, అందుకనుగుణంగా సంస్థల్లో ఉత్పత్తి పెరిగింది. మొత్తంగా ఇన్‌పుట్ ఖర్చులు 2020, సెప్టెంబర్ తర్వాత అతి తక్కువగా పెరిగాయని ఎస్అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటిలిజెస్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియానా డి లిమా చెప్పారు. సమీక్షించిన నెలలో కొత్త ఎగుమతుల ఆర్డర్లు కూడా పుంజుకున్నాయని ఆమె పేర్కొన్నారు. సాధారణంగా ఎస్అండ్‌పీ గ్లోబల్ పీఎంఐ సూచీ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే వృద్ధిగానూ, దానికి దిగువన నమోదైతే క్షీణతగా పరిగణిస్తారు.

Also Read..

ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన మార్కెట్లు!

Advertisement

Next Story