సరికొత్త 'థార్' ను విడుదల చేసిన మహీంద్రా.. ధర ఎంతంటే!

by Harish |   ( Updated:2023-01-21 14:55:21.0  )
సరికొత్త థార్ ను విడుదల చేసిన మహీంద్రా.. ధర ఎంతంటే!
X

న్యూఢిల్లీ: దేశీయ వాహన పరిశ్రమలో అత్యంత ఆదరణ కలిగిన ఆఫ్‌రోడ్ మోడల్‌గా ఉన్న మహీంద్రా థార్ కొత్త వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మహీంద్రా థార్ ఆర్‌డబ్ల్యూడీ(రియర్ వీల్ డ్రైవ్) పేరుతో తెచ్చిన ఈ సరికొత్త వెర్షన్ ప్రారంభ ధరను రూ. 9.99 లక్షలు(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. అయితే, ఈ ధర కేవలం మొదటి 10 వేల యూనిట్లకు మాత్రమే వర్తిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ నెల 14వ తేదీ నుంచి కంపెనీ ఈ కొత్త వెర్షన్ వాహనాలను వినియోగదారులకు డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది.

ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. హార్డ్‌టాప్ రూఫ్‌తో వచ్చే ఈ వాహనం డీజిల్(మాన్యువల్ గేర్‌బాక్స్ మాత్రమే), పెట్రోల్ ఇంజన్‌ (ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్) ఆప్సన్స్‌లలో లభిస్తుంది. కంపెనీ వివరాల ప్రకారం, ఏఎక్స్(ఓ) ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ మాన్యువల్ రూ. 9.99 లక్షలు కాగా, ఎల్ఎక్స్ ఆర్‌డబ్ల్యూడీ డీజిల్ రూ. 10.99 లక్షలు, ఎల్ఎక్స్ ఆర్‌డబ్ల్యూడీ పెట్రోల్ వేరియంట్ రూ. 13.49 లక్షల ధరలో అందుబాటులో ఉన్నాయి.

ఈ వాహనం అధునాతన ఎలక్ట్రానిక్ బ్రేక్-లాకింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఆఫ్‌రోడ్ ప్రయాణాన్ని ఇష్టపడే వారికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. కొత్త థార్ బ్లేజింగ్ బ్రాంజ్, ఎవరెస్ట్ వైట్ రంగుల్లో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి : ఈ ఏడాది అమ్మకాల్లో రెండంకెల వృద్ధి ఖాయం: మెర్సిడెస్ బెంజ్!

Advertisement

Next Story