Mahila Samman Saving Certificate : మరిన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి మహిళా సమ్మాన్ పథకం!

by Harish |   ( Updated:2023-06-28 10:01:26.0  )
Mahila Samman Saving Certificate : మరిన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి మహిళా సమ్మాన్ పథకం!
X

న్యూఢిల్లీ: మహిళల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన చిన్న మొత్తాల పొదుపు పథకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్(ఎంఎస్ఎస్‌సీ) ఇప్పుడు మరిన్ని బ్యాంకుల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఈ పథకం ఇప్పటివరకు పోస్టాఫీసుల్లోనే అందుబాటులో ఉండేది. తాజాగా దీన్ని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు నాలుగు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.

నోటిఫికేషన్ ప్రకారం, ఎంఎస్‌సీ పథకం అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకాన్ని అన్ని బ్రాంచులలో ఆన్‌లైన్ విధానంలోనూ అందించాలని మంత్రిత్వ శాఖ బ్యాంకులను కోరింది.

కాగా, మహిళా పెట్టుబడిదారులను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన ఈ పథకం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జ్ఞాపకార్థం ప్రకటించారు. రెండేళ్ల కాలపరిమితితో వచ్చే ఈ పథకం ద్వారా 7.5 శాతం వడ్డీని పొందవచ్చు. ఇందులో కనిష్ఠంగా రూ. 1,000, గరిష్ఠంగా రూ. 2 లక్షల వరకు పెట్టుబడికి అవకాశం ఉంటుంది. త్రైమాసిక పరంగా వడ్డీ జమ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed