గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 20 వేల కోట్లు ఎల్అండ్‌టీ పెట్టుబడులు!

by srinivas |   ( Updated:2022-08-22 23:00:33.0  )
గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 20 వేల కోట్లు ఎల్అండ్‌టీ పెట్టుబడులు!
X

న్యూఢిల్లీ: ప్రముఖ ఇంజినీరింగ్‌, నిర్మాణ దిగ్గజ సంస్థ లార్సన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌అండ్‌టీ) తన గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులను ప్రకటించింది. గత వారంలోనే గుజరాత్‌లోని హజిరాలో గ్రీన్ ఎనర్జీ ప్లాంటును ప్రారంభించిన అనంతరం కంపెనీ ఈ ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ 2035-2040 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే రాబోయే 3-4 సంవత్సరాల్లో ఈ రంగంలో సుమారు రూ. 20 వేల కోట్ల(2.5 బిలియన్ డాలర్ల) వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్, కంపెనె హోల్ టైమ్ డైరెక్టర్ సుబ్రమణియన్ శర్మ చెప్పారు. క్లీన్ ఎనర్జీ విభాగంలో భారీ పెట్టుబడులతో ఎల్అండ్‌టీ ఎలక్ట్రోలైజర్స్, అడ్వాన్స్‌డ్ సెల్ బ్యాటరీలు, ఫ్యుయెల్ సెల్స్ వంటి కీలక టెక్నాలజీ పరికరాల తయారీని చేపట్టనున్నట్టు సంస్థ గ్రీన్ ఎనర్జీ బిజినెస్ హెడ్ డెరెక్ ఎం షా అన్నారు. ఇప్పటికే ఇండియన్ ఆయిల్, రెన్యూ పవర్ వంటి దిగ్గజ సంస్థలతో కలిసి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ జాయింట్ వెంచర్‌తో పాటు సొంతంగా ఈ రంగంలో పెట్టుబడులను కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

Advertisement

Next Story