LPG Cylinder Price Hike: వినియోగదారులకు బిగ్ షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు..!

by Maddikunta Saikiran |
LPG Cylinder Price Hike: వినియోగదారులకు బిగ్ షాక్.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి నెల ఒకటవ తేదీన చమురు సంస్థలు(Oil Companies) గ్యాస్ సిలిండర్(Gas Cylinder) ధరలను సవరిస్తాయన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల కూడా వాణిజ్య సిలిండర్(Commercial Cylinder) ధరను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ ధరలను డిసెంబర్ 1 నుంచి 16.50 చొప్పున పెంచాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. ఢిల్లీ(Delhi)లో 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధర రూ. 1802 నుంచి 1818.50 కి పెరిగింది. పెరిగిన ధరలు ఈ రోజు నుంచి అమలులోకి రానున్నాయి. కాగా గత నెల ప్రారంభంలో కమర్షియల్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ లిండర్‌ ధరను రూ.62 పెంచిన విషయం తెలిసిందే. ఇక చమురు సంస్థలు కమర్షియల్ సిలిండర్ ధరలను వరుసగా ఆరు నెలల నుంచి పెంచుతూ వస్తున్నాయి. మరోవైపు గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్‌(Cooking Gas cylinder) ధరలను మాత్రం పెంచలేదు. ఆగస్టు నుంచి వీటి ధరలు స్థిరంగా ఉన్నాయి.

Advertisement

Next Story