మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

by samatah |
మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు గుడ్ న్యూస్. ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు అంటారు.అందుకే చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే వాళ్లు ముందుగా కొనుగోలు చేసేది బంగారమే.

కాగా, నేడు మార్కెట్‌లో బంగారం ధర భారీగా తగ్గింది. వివరాల్లోకి వెళ్లితే.. మంగళ వారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర చూస్తే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.500 తగ్గడంతో గోల్డ్ ధర రూ.54,800గా ఉంది. అలాగే,10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.540 తగ్గడంతో గోల్డ్ ధర రూ.58,780గా ఉంది.

Advertisement

Next Story