తిరిగి లోన్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారా.. అయితే ఇది మీకోసమే

by Harish |   ( Updated:2022-12-27 07:11:23.0  )
తిరిగి లోన్ చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారా.. అయితే ఇది మీకోసమే
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆర్థిక అవసరాలకు చాలా మంది వివిధ ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులలో లోన్‌లు తీసుకుంటున్నారు. అవి అర్హత ఆధారంగా రూ. 10 వేల నుంచి కొన్ని కోట్ల వరకు కూడా లోన్‌లను మంజూరు చేస్తు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతున్నాయి. కానీ లోన్‌లు తిరిగి చెల్లించేటప్పుడు కొంచెం ఆలస్యమైన అధికంగా ఫీజులు విధిస్తుంటారు. అయితే తిరిగి లోన్‌లు చెల్లించడానికి ఇబ్బందులు ఉన్నప్పుడు బ్యంకులు కానీ ఫైనాన్స్ సంస్థలు కానీ వినియోగదారులను ఇబ్బందులకు గురి చేయకుండా కొన్ని సులభ పద్ధతుల్లో చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పించాయి. అవి ఏంటంటే..1. లోన్ రీఫైనాన్సింగ్ 2. లోన్ రీస్ట్రక్చైరింగ్.

వీటి గురించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం..

1. లోన్ రీఫైనాన్సింగ్: దీనిని 'టాప్ అప్ లోన్' అని కూడా అంటారు. ఇప్పటికే తీసుకున్నటువంటి లోన్‌లకు వడ్డీ ఎక్కువగా ఉండటం, ఆలస్య చెల్లింపుల ఫీజులు అధికంగా ఉండటం వలన లోన్ చెల్లింపులకు ఇబ్బందులు పడేవారు, తక్కువ వడ్డీ రేటుతో, సులభంగా లోన్ చెల్లింపులు చేయడానికి కొత్త రుణాలు తీసుకోవడాన్ని 'రీఫైనాన్సింగ్' అంటారు. వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతూ కాకుండా స్థిరంగా ఉండే వడ్డీ రేటు దీని క్రిందికి వస్తుంది. ఒకే రకమైన వడ్డీ రేటు వలన వినియోగదారులు లోన్ చెల్లింపులు సులభంగా చేయవచ్చు.

ముఖ్యంగా ఈ విధమైన రీఫైనాన్సింగ్ సదుపాయాన్ని అందరికీ కాకుండా క్రెడిట్ స్కోర్ బాగుండి, లోన్ చెల్లింపులు సరిగ్గా చేసిన వారికి ఈ ఆప్షన్ పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ గమనించ దగ్గ విషయం ఏంటంటే పాత లోన్ నుంచి కొత్త లోన్‌కు మారినప్పుడు అదనంగా ఫీజు(ప్రాసెసింగ్ ఫీజు) చెల్లించాల్సి ఉంటుంది. కొత్త వడ్డీ వలన ఉపయోగం ఉంటుందని అనుకున్నప్పుడు ఈ రకమైన లోన్ ఆప్షన్‌ను తీసుకోవచ్చు.

2. లోన్ రీస్ట్రక్చైరింగ్: దీనిని లోన్ పునర్నిర్మాణం అని కూడా అంటారు. లోన్ చెల్లింపులు భారం అయినప్పుడు వాయిదాలు సరిగ్గా చెల్లించలేని పరిస్థితుల్లో లోన్ పునర్నిర్మాణం ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఇప్పటికే తీసుకున్నటువంటి లోన్‌లకు సంబంధించిన నిబంధనలు మార్చడం జరుగుతుంది. లోన్ మొత్తం, వాయిదాల చెల్లింపు టైం అన్నింటిని కూడా మారుస్తారు.

రుణ గ్రహితల ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఈ సదుపాయాన్ని అందిస్తారు. అందరికీ కాకుండా రుణాల చెల్లింపులు కష్టంగా ఉన్న వారికి చివరి అవకాశంగా లోన్ చెల్లింపులకు రీస్ట్రక్చైరింగ్ ఆప్షన్‌కు అంగీకరిస్తారు. దివాళా తీసే వారికి సులభ చెల్లింపులకు అంగీకరిస్తూ మెల్లమెల్లగా లోన్ రికవరీ చేయడానికి బ్యాంకులు/ఫైనాన్స్ సంస్థలకు ఇది మంచి ఆప్షన్.

Read more:

హోమ్ లోన్ వినియోగదారులకు షాక్ ఇచ్చిన LIC

Advertisement

Next Story

Most Viewed