మార్చి 5 నాటికి ఎల్ఐసీకి అదానీ గ్రూప్ కంపెనీ రుణ బకాయిలు రూ. 6,184 కోట్లు!

by Harish |
మార్చి 5 నాటికి ఎల్ఐసీకి అదానీ గ్రూప్ కంపెనీ రుణ బకాయిలు రూ. 6,184 కోట్లు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 5 నాటికి ఎల్ఐసీకి అదానీ గ్రూప్ కంపెనీ రుణ బకాయిలు రూ. 6,183.64 కోట్లకు తగ్గిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో తెలిపారు. అంతకుముందు 2022, డిసెంబర్ చివరి నాటికి ఉన్న బకాయిలు రూ. 6,347.32 కోట్లుగా ఉండేదని పేర్కొన్నారు. మొత్తం బకాయిలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ రూ. 5,388.60 కోట్లు, అదానీ పవర్(ముంద్రా) రూ. 266 కోట్లు, అదానీ పవర్ మహారాష్ట్ర ఫేజ్-1 రూ. 81.60 కోట్లు, అదానీ పవర్ మహారాష్ట్ర ఫేజ్-3 రూ. 254.87 కోట్లు, రాయ్‌గఢ్ ఎనర్జీ రూ. 45 కోట్లు, రాపూర్ ఎనర్జెన్ రూ. 145.67 కోట్లు ఉన్నాయి.

ఇదే సమయంలో అదానీ కంపెనీలకు తాము ఎలాంటి రుణాలు ఇవ్వలేదని ఐదు ప్రభుత్వ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు వెల్లడించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి చెప్పారు. ప్రభుత్వ బ్యాంకులు ఆయా కంపెనీల పనితీరు, ప్రాజెక్టుల అమలు, రిస్క్‌ను అంచనా వేసిన తర్వాతే రుణాలు మంజూరు చేశాయన్నారు. ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయంతోనే రుణాలు చెల్లించబడతాయని, కంపెనీ మార్కెట్ విలువ ఆధారంగా కాదని చెప్పినట్టి మంత్రి వివరించారు.

మరోవైపు, అదానీ గ్రూప్‌, హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదని పంకజ్‌ చౌదరి స్పష్టం చేశారు. స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందన్నారు.

Advertisement

Next Story