- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండు టర్మ్ ప్లాన్‌లను ఉపసంహరించుకున్న ఎల్ఐసీ!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ తన జీవన్ అమర్, టెక్ టర్మ్ వంటి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో జీవన్ అమర్ ఆఫ్‌లైన్ పాలసీ కాగా, టెక్ టర్మ్ ఆన్‌లైన్ పాలసీ. ఈ రెండు ప్లాన్‌లు బుధవారం నుంచి పూర్తిగా అందుబాటులో ఉండవని ఎల్ఐసీ వెల్లడించింది.
ఇటీవల రీ-ఇన్సూరెన్స్ రేట్లు పెరిగాయని, అందుకే వీటిని ఉపసంహరించుకుంటున్నట్టు ఎల్ఐసీ వివరించింది. త్వరలో ఈ పాలసీల్లో అవసరమైన మార్పులు చేసి కొత్త టర్మ్ ప్లాన్‌లను తీసుకురానున్నట్టు ఎల్ఐసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ రెండు ప్లాన్‌లను తీసుకున్న వారికి కొనసాగుతాయని, కొత్తగా కొనేవారికి మాత్రమే అందుబాటులో ఉండవచని ఎల్ఐసీ పేర్కొంది.
టెక్ టర్మ్ పాలసీని మొదటగా 2019లో తీసుకొచ్చారు. అదే ఏడాదిలో జీవన్ అమర్ ప్లాన్‌ను ప్రారంభించారు. వీటి ప్రీమియం ధరలను అప్పటి నుంచి పెంచలేదు. పాలసీలు మార్కెట్‌లోకి వచ్చిన దగ్గరి నుంచి చూస్తే అంటే మూడేళ్ల నుంచి ఈ పాలసీల ప్రీమియం రేట్లు అలానే ఉన్నాయి. ఇదే కాలంలో ప్రైవేట్ కంపెనీలు తీసుకువచ్చిన ప్లాన్‌ల రేట్లు ఏకంగా 40 శాతం వరకు పెరిగాయి.
కరోనా మహమ్మారి వల్ల కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ రేట్లను పెంచేశాయి. కానీ, ఎల్ఐసీ మాత్రం ఈ పాలసీ ప్రీమియం రేట్లను ఒకే ధరలో కొనసాగిస్తూ వచ్చింది. కాగా, ఈ రెండు ప్లాన్‌లలో కాలవ్యవధిలోగా పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి ఇస్తారు. 10-40 ఏళ్ల మధ్య కాల వ్యవధి ఉండే ఈ రెండింటిలో జీవన్ అమర్ ప్లాన్ కనీస హామీ రూ. 25 లక్షలు కాగా, టెక్ టర్మ్ ప్లాన్ రూ. 50 లక్షలు. గరిష్ట పరిమితి లేదు.