- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలసీదారుల కోసం వాట్సాప్ సర్వీసులను ప్రారంభించిన ఎల్ఐసీ!
X
ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ వినియోగదారుల కోసం సరికొత్త సేవలను ప్రారంభించింది. బీమా అవసరాలకు సంబంధించి పాలసీ వివరాలతో పాటు ప్రీమియం, బోనస్, ఇంకా పలు సేవల సమాచారాన్ని అందించే వాట్సాప్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దీనివల్ల వినియోగదారులు ఇకమీదట నేరుగా బీమా కార్యాలయానికి వెళ్లే పనిలేకుండా, ఇన్సూరెన్స్ ఏజెంట్ కోసం ఎదురు చూడకుండా మెరుగైన సేవలను పొందవచ్చు. ఈ మేరకు వాట్సాప్ సర్వీసులను ప్రారంభించినట్టు ఎల్ఐసీ ఛైర్మన్ ఎం ఆర్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
పాలసీదారులు తమ పాలసీ వివరాలను ఎల్ఐసీ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌కు ఈ సేవలు అందుతాయని పేర్కొన్నారు. పాలసీదారులు వాట్సాప్ సర్వీసులను పొందడానికి రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ నుంచి 8976862090 నంబర్‌కు మెసేజ్ చేసి ఎలాంటి సమాచారాన్నైనా పొందవచ్చు.
Advertisement
- Tags
- LIC
Next Story