LIC Q2 Results: ప్రీమియంల ఆదాయం పెరిగినా.. ఎల్ఐసీ లాభాల్లో క్షీణత..!

by Maddikunta Saikiran |
LIC Q2 Results: ప్రీమియంల ఆదాయం పెరిగినా.. ఎల్ఐసీ లాభాల్లో క్షీణత..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగానికి చెందిన జీవిత బీమా సంస్థ(Life Insurance Company) లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) శుక్రవారం సెప్టెంబర్(September)తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక(Q2FY25) ఫలితాల్లో ఎల్ఐసీ రూ. 7621 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కాగా గతేడాది ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో నమోదైన రూ. 7,925 కోట్లతో పోలిస్తే ఈ సారి 4 శాతం మేర లాభాలు తగ్గాయని సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. ఇక ఈ త్రైమాసికంలో ప్రీమియంల ఆదాయం 11 శాతం వృద్ధి చెంది రూ. 1.19 లక్షల కోట్లుగా నమోదైందని, అలాగే సంస్థ కార్యకలాపాల ఆదాయం రూ. 2.01 లక్షల కోట్ల నుంచి రూ. 2.29 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. కాగా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో 61.07 శాతంతో ఆ సంస్థ స్టాక్ మార్కెట్(Stock Market)లో మొదటి స్థానంలో ఉంది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఎన్ఎస్ఈ(NSE)లో ఎల్ఐసీ షేరు విలువ 1.5 శాతం తగ్గి రూ.915.55 వద్ద స్థిరపడింది.

Advertisement

Next Story