- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదాయ పన్ను శాఖ నుంచి భారీ రీఫండ్ పొందిన ఎల్ఐసీ
by S Gopi |
X
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆదాయ పన్ను శాఖ నుంచి 2012-13 నుంచి 2014-15, 2016-17, 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన రీఫండ్లను పొందినట్టు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి రెండోవారంలో మొత్తం రూ. 21,740.77 కోట్ల విలువైన రీఫండ్లను అందుకున్నట్టు పేర్కొంది. సమీక్షించిన కాలానికి మొత్తం రూ. 25,464.46 కోట్ల రీఫండ్లు రావాల్సి ఉందని, మిగిలిన రూ. 3,700 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ మొత్తాన్ని పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది. కాగా, ఇటీవల ఎల్ఐసీ సంస్థ షేర్లు స్టాక్ మార్కెట్లలో మెరుగ్గా ర్యాలీ చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 21 శాతం పుంజుకుంది. ఈ నెలలోనే తొలిసారిగా రూ. వెయ్యి మార్కును అధిగమించింది.
Advertisement
Next Story