ఒక్కసారి చెల్లిస్తే జీవితాంతం రూ. 52,000 పెన్షన్.. పూర్తి వివరాలు ఇవే

by Harish |   ( Updated:2023-01-06 13:09:58.0  )
ఒక్కసారి చెల్లిస్తే జీవితాంతం రూ. 52,000 పెన్షన్.. పూర్తి వివరాలు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తుంది. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూడా LICకి మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం బీమా సదుపాయం తో పాటు ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని ఇవ్వడానికి కొన్ని పథకాలను తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా LIC నుంచి వచ్చిన 'జీవన్ సరళ్ పాలసీ' ప్రజలకు బీమా రక్షణతో పాటు వార్షిక ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా పదవీ విరమణ పొందిన వారు లేదా సాధారణ ఆదాయం కోసం ప్లాన్ చేస్తున్న వారు జీవన్ సరళ్ పాలసీని తీసుకోవచ్చు. దీనిలో సంవత్సరం ప్రాతిపదికన లేదా అర్ధ-వార్షిక లేదా త్రైమాసిక పెన్షన్‌ను తీసుకోవచ్చు.

LIC జీవన్ సరళ్ పాలసీలో 40-80 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఒకేసారి రూ. 10 లక్షలు పెట్టుబడి పెడితే జీవితాంతం సంవత్సరానికి రూ. 52,000 పెన్షన్ లభిస్తుంది. నెలకు కనీస పెన్షన్ రూ. 1000, గరిష్టంగా అయితే రూ. 12,000. డెత్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అమౌంట్ డిపాజిట్ చేసిన వ్యక్తి ఏ కారణంగా మరణించినా, అతనికి ఎంత ఐతే ప్రతినెలా పెన్షన్ లభిస్తుందో నామినీకి కూడా జీవితాంతం అదే అమౌంట్ లభిస్తుంది. అదనంగా అత్యవసర సమయంలో డిపాజిట్ అమౌంట్ పై లోన్ కూడా పొందవచ్చు.

Read more:

Aadhaar Card సేవల కోసం Toll-Free నంబర్‌ను తీసుకొచ్చిన UIDAI

Advertisement

Next Story

Most Viewed