SEBI: IPOకు రాబోతున్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా

by Harish |
SEBI: IPOకు రాబోతున్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దక్షిణకొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఎల్‌జీ తన భారత అనుబంధ సంస్థను ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)కు తీసుకురావాలని చూస్తుంది. ఈ ఐపీఓ ద్వారా దాదాపు రూ.12,582 కోట్ల($1.5 బిలియన్ల)ను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే భారత మార్కెట్లో చాలా కంపెనీలు ఐపీఓకు రాగా, వాటిలో దాదాపు అన్ని కూడా సక్సెస్ అయ్యాయి. దీంతో LG ఎలక్ట్రానిక్స్ ఇండియా సైతం తన కంపెనీని మరింత అభివృద్ధి చేయడానికి వినియోగదారులకు మరిన్ని కొత్త ఉత్పత్తులను అందించడానికి నిధుల కోసం ఐపీఓకు రాబోతుంది.

ఈ ఐపీఓ వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉండవచ్చని సంబంధిత వర్గాల వారు తెలిపారు. ప్రస్తుతం LG ఎలక్ట్రానిక్స్ ఇండియా మార్కెట్ విలువ సుమారు $13 బిలియన్లుగా ఉంది. ఒక నివేదిక ప్రకారం, స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్‌కు వచ్చే నెలలో కంపెనీ ఐపీఓకు సంబంధించిన పేపర్లను సబ్మిట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ఐపీఓ నిర్వహణలో జేపీ మోర్గాన్‌, మోర్గాన్‌ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా కార్ప్., సిటీ గ్రూప్ ఇంక్ భాగమయ్యే అవకాశం ఉంది. భారతదేశం పెట్టుబడి అవకాశాలకు కేంద్రంగా ఉన్న నేపథ్యంలో దేశ వృద్ధి సామర్థ్యం రానున్న కాలంలో మరింత పెరగడానికి మంచి అవకాశాలు ఉన్న కారణంగా చాలా కంపెనీలు దేశంలో తమ పెట్టుబడులను పెంచుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed