- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను విషయంలో కేంద్రానికి లేఖ
న్యూఢిల్లీ: ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ ఆన్‌లైన్ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై సంబంధిత పరిశ్రమ సంస్థలు, గేమ్ డెవలపర్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని కోరుతూ 130కి పైగా గేమింగ్ కంపెనీలు, పరిశ్రమ సంఘాలు కేంద్రానికి ఒక లేఖ రాశాయి. ఇప్పుడిప్పుడే గేమింగ్ పరిశ్రమ వృద్ధి చెందుతుంది. ఇలాంటి తరుణంలో 28 శాతం పన్ను విధించడం ద్వారా గేమింగ్ రంగం వృద్ధి తగ్గిపోయి, ఈ రంగాన్ని ఎంచుకున్న వారికి భారీ నష్టాలు వస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
జీఎస్టీ భారం పెరగడం వలన బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వానికి గణనీయమైన పన్ను నష్టానికి దారి తీస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకుముందు ఆన్‌లైన్ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీ ఉండగా జులై 11న జరిగిన సమావేశంలో 28 శాతానికి జీఎస్టీ పెంచారు. దీని ప్రకారం, ఇకమీదట ఆన్‌లైన్ గేమింగ్‌లో ప్రతి రూ.100 లపై 28 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది.