- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మాల్స్ లీజింగ్ కోసం భారీగా పోటీ.. ఈ ఏడాది ఫుల్ డిమాండ్!
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన ఎనిమిది నగరాల్లో మాల్స్, ఖరీదైన ప్రాంతాల్లో రిటైల్ స్థలాల లీజు 17-28 శాతం పెరగనుందని ప్రముఖ రియల్టీ కన్సల్టెంట్ సంస్థ సీబీఆర్ఈ ఇండియా తెలిపింది. వినియోగదారుల నుంచి ఫ్యాషన్, హోమ్‌వేర్, డిపార్ట్‌మెంటల్ స్టోర్ వ్యాపారుల నుంచి గిరాకీ భారీగా ఉండటంతో ఈ ఏడాది రిటైల్ స్థలాల లీజు గణనీయంగా పుంజుకోనుందని సీబీఆర్ఈ ఇండియా వెల్లడించింది.
తాజా ఇండియా మార్కెట్ ఔట్‌లుక్-2023 నివేదిక ప్రకారం, రిటైల్ లీజింగ్ 2019 గరిష్ట స్థాయిలకు చేరువగా 55-60 లక్షల చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. ఇది గత ఐదేళ్లలోనే అత్యధికం. కొత్తగా నిర్మాణాలు పూర్తయిన మాల్స్‌కు అధిక డిమాండ్ ఉంటుందని, మొత్తం రిటైల్ స్థలాల విభాగంలో ఇదే కీలకంగా ఉండనుందని తెలిపింది. భారత్‌లో వినియోగం అత్యధికంగా ఉన్నందున రిటైల్ రంగం మరింత వేగంగా వృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమాన్ మ్యాగజైన్ అన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో కొత్తగా 16 మాల్స్ అందుబాటులోకి రానున్నాయి. అందులో అత్యధికంగా ఈ-కామర్స్, ఇతర స్టోర్లు ఎక్కువగా లీజింగ్ కార్యకలాపాలను నిర్వహించనున్నాయని సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియాల్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గగన్ రాందేవ్ పేర్కొన్నారు.
Also Read..
అలర్ట్: ఏప్రిల్ 1 నుంచి వివిధ వస్తువుల ధరల్లో రానున్న భారీ మార్పులు!