Lead Group: లీడ్ గ్రూప్ కీలక నిర్ణయం.. విద్యార్థుల కోసం టెక్‌బుక్‌ సేవలు ప్రారంభం..!

by Maddikunta Saikiran |
Lead Group: లీడ్ గ్రూప్ కీలక నిర్ణయం.. విద్యార్థుల కోసం టెక్‌బుక్‌ సేవలు ప్రారంభం..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రముఖ ఎడ్యుటెక్‌ సంస్థ లీడ్‌ గ్రూప్‌(Lead Group).. టెక్‌బుక్‌(TechBook) పేరుతో కొత్త సేవలను ప్రారంభించింది. సాంప్రదాయ పాఠ్యపుస్తకాలకు(Textbooks)కు ప్రత్యామ్న్యాయంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ టెక్‌బుక్‌ ద్వారా విద్యార్థులు పాఠాలను ఈజీగా నేర్చుకోవచ్చని సంస్థ సీఈఓ, కో-ఫౌండర్(CEO, Co-Founder) సుమీత్‌ మెహతా(Sumeet Mehta) తెలిపారు. సీబీఎస్ఈ సిలబస్(CBSE Syllabus)కు తగ్గట్టు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్ధులకు వీటిని తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. మూడు కటింగ్‌ ఎడ్జ్‌ టెక్నాలజీలు, పర్సనలైజ్డ్‌ రీడింగ్‌ ఫ్లూయెన్సీ(Personalized Reading Fluency), పర్సనలైజ్డ్‌ ప్రాక్టీస్‌(Personalized Practice) పేరుతో దీన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. త్రీడీ(3D) విధానంలో విద్యార్ధులు పాఠాలను సులభంగా అర్ధం చేసుకునేలా ఈ టెక్‌బుక్‌ లు యూజ్ అవుతాయని, రాబోయే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌(AP), తెలంగాణ(TG)లో 500కు పైగా పాఠశాలల్లో ఈ టెక్‌బుక్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు సుమిత్‌ చెప్పారు.

Advertisement

Next Story