- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LK Advani: అడ్వాణీకి ప్రధాని మోడీ బర్త్ డే విషెస్
దిశ, నేషనల్ బ్యూరో: భారత దేశ మాజీ డిప్యూటీ పీఎం, మాజీ హోం మంత్రి లాల్ క్రిష్ణ అడ్వాణీ(LK Advani)కి ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) జన్మదిన శుభాకాంక్షలు(Birthday Wishes) తెలిపారు. దేశానికి విశేష సేవలు అందించిన ఎల్‌కే అడ్వాణీకి భారత రత్న పురస్కారం పొందిన ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. రాజనీతిజ్ఞుడిగా పేరున్న అడ్వాణీ దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారని వివరించారు. ఆయన తెలివితేటలు, విలువైన సలహాలకు ఆయన ఎల్లప్పుడూ గౌరవం పొందుతూనే ఉంటారని, కొన్నేళ్లపాటు ఆయన మార్గదర్శనంలో నడవడం తన అదృష్టమని ట్వీట్ చేశారు. బీజేపీని సంక్షేమానికి ప్రతీకగా మలిచిన భారత రత్న ఎల్‌కే అడ్వాణీకి శుభాకాంక్షలు అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆయన నాయకత్వంలో బీజేపీ సంస్థాగతంగా బలపడిందని, విస్తరించిందని వివరించారు. డిప్యూటీ పీఎంగా, హోమం మంత్రిగా ఆయన సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. అటల్ బిహార్ వాజ్‌పేయి సారథ్యంలో 2002 నుంచి 2004 వరకు కొనసాగిన ఎన్డీయే ప్రభుత్వంలో అడ్వాణీ డిప్యూటీ పీఎంగా సేవలు అందించారు. ఈ ఏడాది మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎల్‌కే అడ్వాణీ భారత రత్న అవార్డు పొందారు.
Read More..
PM Narendra Modi :ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్.. మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రచారంలో పరస్పర విమర్శలు