Rocking Rakesh: KCR సినిమా రిలీజ్ డేట్స్ ఫిక్స్..

by sudharani |
Rocking Rakesh: KCR సినిమా రిలీజ్ డేట్స్ ఫిక్స్..
X

దిశ, సినిమా: జబర్దస్త్ (Jabardast) ద్వారా ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) హీరోగా నటిస్తున్న చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (KCR). అనన్య కృష్ణన్ (Ananya Krishnan) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ ట్రీ (Green Tree) ప్రొడక్షన్స్‌పై డైరెక్టర్ గరుడవేగ అంజి (Gardavega Anji) తెరకెక్కిస్తుండగా.. రాకింగ్ రాకేష్ (Rocking Rakesh) స్వయంగా నిర్మిస్తున్నాడు. లంబాడీ వర్గానికి చెందిన యువకుడి రియల్ లైఫ్ (Real Life) ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. ట్రైలర్ (Trailer)కు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను ‘బలగం’ డైరెక్టర్ వేణు (venu) లాంచ్ చేసి.. ఈ నెల 22న సినిమా రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో జోర్దార్ సుజాత, ధనరాజ్, తనికెళ్ల భరణి, తాగుబోతు రమేష్, కృష్ణ భగవాన్, రవి రచ్చ, మై మధు, లోహిత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Next Story