- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత న్యాయ సేవలను వినియోగించుకోండి
దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జిల్లా న్యాయ సేవాధికార సేవలను వినియోగించుకోవాలని జిల్లా సివిల్ జడ్జి జి.భానుమతి సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార దినోత్సవం సందర్భంగా శుక్రవారం కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయం జూలూరుపాడులో ఏర్పాటు చేసిన న్యాయ చైతన్య కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో పేద, బడుగు బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను వినియోగించుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం నవంబర్ 9న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ దినోత్సవంను జరుపుకుంటున్నట్టు తెలిపారు.
బాల కార్మిక చట్టం ప్రకారం 14 సంవత్సరాలలోపు చిన్నారులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని అన్నారు. విద్యార్థులు చెడు మార్గాలను విడనాడి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం న్యాయమూర్తి హాస్టల్ ను తనిఖీ చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం, నాణ్యమైన విద్యను అందించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి, న్యాయవాది తెల్లబోయిన రమేష్, ప్రిన్సిపాల్ పద్మజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.