- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Harishrao Challenge: సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్.. దమ్ముంటే ఇక్కడ చెయ్
దిశ, తెలంగాణ బ్యూరో: దమ్ముంటే.. హైదరాబాద్ నుండి మీ పాద యాత్ర మొదలు పెట్టండి అని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సవాల్ చేశారు. మీ పాదయాత్రకు ప్రజల మద్దతే ఉండి ఉంటే, ఈ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి (Revanth Reddy) అని ప్రశ్నించారు. ఎక్స్ (X) వేదికగా శుక్రవారం మండిపడ్డారు. కాంగ్రెస్ 11 నెలల పాలనే కాదు, మీ పాదయాత్ర కూడా నిర్బంధాల మధ్య కొనసాగుతుండడం దురదృష్టకరం అన్నారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ (BRS) నేతలను, కార్యకర్తలను హౌస్ అరెస్టులు చేసినంత మాత్రాన మీ పాదయాత్రకు ప్రజల మద్దతు లభించదు అన్నారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉందన్నారు. మూసీ మురికి కూపంగా మారడానికి మీ 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా? పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర చేసినా మీ కాంగ్రెస్ పార్టీ పాపం పోదు రేవంత్ రెడ్డి అని నిలదీశారు. పేదల గూడు కూల్చింది ఒక దగ్గర, మీ పాదయాత్ర మరొక దగ్గర, హైదరాబాదులో ఇండ్లు కూల్చి, నల్లగొండలో పాదయాత్ర చేస్తారా? అని ప్రశ్నించారు.
గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే నిర్లక్ష్యం, అదే అలసత్వం అన్నారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా, ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. గురుకుల విద్యార్థుల కష్టాలు తీరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల మంచిర్యాల (Mancherial) గిరిజన గురుకులంలో 12 మంది విద్యార్థునులు ఆసుపత్రి పాలైన ఘటన గడిచి 24 గంటలు కూడా కాకముందే, మరోసారి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థులు ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి నెలకొందన్నారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు సరైన వైద్యం అందించలేని దుర్మార్గ దుస్థితికి ఈ ప్రభుత్వం చేరుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) గాడి తప్పిన పాలనకు వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. నిర్మల్, వాంకిడి, మంచిర్యాల గురుకులాల్లో ఇప్పటి వరకు మొత్తం 94 మంది ఆసుపత్రుల పాలు కాగా, ఇంద్రవెల్లి, నిర్మల్ గురుకులాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు జ్వరంతో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న వాంకిడి గురుకులానికి చెందిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితి ఇంకా అలాగే ఉందన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని, మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. నేను పోను బిడ్డో సర్కారు దవాఖానాకు అనేది ఏండ్ల నుంచి వస్తున్న కాంగ్రెస్ పాలన మార్క్ అయితే, ఇప్పుడు నేను పోను బిడ్డో గురుకుల పాఠశాలకు అనేది కాంగ్రెస్ సర్కారు నయా మార్క్ గా మారిందని ఎద్దేవా చేశారు. ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, పతనమవుతున్న గురుకులాలపై సమీక్ష నిర్వహించాలని, ఫుడ్ పాయిజన్ కేసులు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.