Luxury cars: భారత్‌లో జోరందుకున్న లగ్జరీ కార్ల అమ్మకాలు

by Harish |
Luxury cars: భారత్‌లో జోరందుకున్న లగ్జరీ కార్ల అమ్మకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అత్యంత వేగంగా అభివృద్ధి చెందున్న భారత్‌లో సూపర్ లగ్జరీ కార్ల కొనుగోళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతుంది. ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం, వరుసగా మూడో సంవత్సరంలో కూడా ఇండియాలో ఈ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. సూపర్ లగ్జరీ కార్ల ధరల రెంజ్ దాదాపు రూ.2.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు ఉంటుంది. ఈ విభాగంలో, 2023లో 1,000 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, ఈ సంవత్సరం గణాంకాలు 1,200 నుంచి 1,300 యూనిట్ల మధ్యకు చేరుకోవచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం, లంబోర్ఘిని కార్లు ఇండియాలో ఎక్కువ అమ్మకాలను నమోదు చేశాయి. దీని మోడల్స్‌లో హురాకాన్, ఉరుస్, రెవెల్టో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న డిమాండ్ మేరకు లంబోర్ఘిని కొత్త కార్ల బుకింగ్‌లు 2026 తర్వాత మాత్రమే డెలివరీ చేసే అవకాశం ఉంది. 2023లో, లంబోర్ఘిని భారతదేశంలో 103 వాహనాలను విక్రయించింది, ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇది మరింత పెరుగుతుంది.

అదేవిధంగా, ఫెరారీ, మెక్‌లారెన్, ఆస్టన్ మార్టిన్‌లకు భారత మార్కెట్‌లో బలమైన డిమాండ్ ఉంది. Mercedes Benz, Audi కంపెనీలకు చెందిన హై-ఎండ్ మోడల్‌లు ఒక సంవత్సరం వరకు వెయిటింగ్ పీరియడ్‌లను కలిగి ఉన్నాయి, వీటి ధరలు రూ. 2.5 కోట్ల నుండి రూ.4.55 కోట్ల వరకు ఉంటాయి.

Advertisement

Next Story

Most Viewed