- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎఫ్‌డీల వడ్డీ రేట్లు పెంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్!
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) తాజాగా కీలక రెపో రేటును వరుసగా ఐదోసారి పెంచడంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఆర్‌బీఐ రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు శుక్రవారం(డిసెంబర్ 9) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు వెల్లడించింది. వివిధ కాలవ్యవధులను బట్టి డిపాజిట్లపై వడ్డీ రేట్లలో మార్పులు చేసింది.
సాధారణ ఖాతాదారుల కంటే సీనియర్ సిటిజన్లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సవరించిన వడ్డీ రేట్లు.. 7-14 రోజుల కాలవ్యవధితో చేసే డిపాజిట్లపై 2.75 శాతం, 15-30 రోజుల ఎఫ్‌డీలపై 3 శాతం, 31-45 రోజుల ఎఫ్‌డీలపై 3.25 శాతం, 46-90 రోజుల ఎఫ్‌డీకి 3.50 శాతం, 91-120 రోజుల కాలవ్యవధిపై 4 శాతం, 121-179 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం, 180-270 రోజుల కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలకు 5.50 శాతం, 271-360 రోజుల ఎఫ్‌డీలపై 5.75 శాతం, 364 రోజుల ఎఫ్‌డీలకు 6 శాతం, 2 ఏళ్లలోపు ఎఫ్‌డీలకు 6.50 శాతం వడ్డీ లభించనుంది.
తక్కువ కాలవ్యవధి ఉండే ఎఫ్‌డీలను ముందుగా ఉపసంహరించుకునే ఎలాంటి జరిమానా ఉండదని బ్యాంకు తెలిపింది. 180-364 రోజుల ఎఫ్‌డీలను ముందుగా తీసుకుంటే 0.50 శాతం, ఏడాది కంటే ఎక్కువ ఉండే ఎఫ్‌డీలను ముందుగా తీసుకుంటే 1 శాతం జరిమానా ఉంటుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణలో బిడ్ల సమర్పణ గడువు పొడిగించే అవకాశం!