కోటక్ బ్యాంక్ వినియోగదారులకు పిడుగులాంటి వార్త!

by Harish |   ( Updated:2023-03-16 14:04:59.0  )
కోటక్ బ్యాంక్ వినియోగదారులకు పిడుగులాంటి వార్త!
X

ముంబై: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ రుణాల రేట్లు మరింత భారం కానున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు బ్యాంకు ఓ ప్రకటనలో వెల్లడించింది. సవరించిన వడ్డీ రేట్లు మార్చి 16 నుంచే అమలవుతాయని స్పష్టం చేసింది. ఈ పెంపు ద్వారా వినియోగదారులు చెల్లించే నెలవారీ ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. ఎంసీఎల్ఆర్ రేటు పెంపు కారణంగా వినియోగదారులు తీసుకునే గృహ, వ్యక్తిగత, వాహన రుణాలపై వడ్డీ రేట్ల ప్రభావితం ఉంటుంది.

దీని ప్రకారం, వినియోగదారులు తీసుకునే రుణాలపై భారం పడే ఏడాది కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ రేటు 9.05 శాతానికి పెరగనుంది. ఇది బ్యాంకు ఇస్తున్న కనిష్ట రేటు. మిగిలిన కాలవ్యవధులకు సంబంధించి నెలరోజు ఎంసీఎల్ఆర్‌ను 8.50 శాతానికి, మూడు నెలల ఎంసీఎల్ఆర్‌ను 8.65 శాతానికి, ఆరు నెలల ఎంసీఎల్ఆర్‌ను 8.85 శాతానికి, రెండేళ్ల కాలవ్యవధి కలిగిన ఎంసీఎల్ఆర్ 9.10 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్‌ను 9.25 శాతానికి పెంచింది.

Also Read..

ఎట్టకేలకు లాభాల్లోకి మారిన మార్కెట్లు!

Advertisement

Next Story