మార్కెట్లోకి ‘Kia’ కొత్త మోడల్ కారు

by Harish |
మార్కెట్లోకి ‘Kia’ కొత్త మోడల్ కారు
X

దిశ, వెబ్‌డెస్క్: కీయా కంపెనీ సోనెట్ లైనప్‌లో భాగంగా కొత్తగా ‘ఆరోక్స్’ ఎడిషన్‌ను కారును లాంచ్ చేసింది. దీని ధర రూ. 11.85 లక్షల నుండి రూ. 13.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). Kia Sonet Aurochs డిజైన్ వినియోగదారులకు బాగా నచ్చుతుందని కంపెనీ పేర్కొంది. ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ వేరియంట్‌ ఇంజన్‌లో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ 118 bhp గరిష్ట శక్తిని, 172 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, 6-స్పీడ్ iMT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. అదే డీజిల్ మోడల్ 114 bhp శక్తిని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ DCT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.




ఈ రెండింటిలో LED హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, Apple CarPlayతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్, ఆటోమేటిక్ AC, నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. దీని లోపల క్యాబిన్ కూడా చాలా అధునాతనంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story