- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదటి రోజే రికార్డు స్థాయిలో బుకింగ్స్
ముంబై: దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ నుంచి ఇండియాలో ఇటీవల విడుదలైన కారు మొదటి రోజు రికార్డు స్థాయిలో బుకింగ్‌లను సాధించింది. ఈ మోడల్ పేరు ‘సెల్టోస్’. కియా మోటార్స్ ఇండియా ఈ కారును జులై 14న ముందస్తు బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది, దీని కోసం రూ.25,000 చెల్లించాలి. మొదటి రోజే ఈ కారు కోసం రికార్డు స్థాయిలో 13,424 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ తెలిపింది. ఈ బుకింగ్‌లో ప్రత్యేకంగా K-కోడ్ ఆధారిత బుకింగ్ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఈ కోడ్ ద్వారానే 1,973 బుకింగ్‌లు వచ్చాయి. ఈ కారు లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్స్ అసిటెన్స్ సిస్టమ్స్ (ADAS) భద్రతా ఫీచర్లతో వచ్చింది. కారులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఫోన్ చార్జర్, నావిగేషన్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్, పనోరమిక్ సన్‌రూఫ్ మొదలగు ఫీచర్లు ఉన్నాయి.