- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kia India: దేశీయ అమ్మకాల్లో 2.5 శాతం వృద్దిని సాధించిన కియా ఇండియా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా ఈ ఏడాది జులైలో దేశీయంగా 20,507 వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే 2.5 శాతం వృద్ధి. 2023 జులై నెలలో 20,002 వాహనాలను విక్రయించింది. ముఖ్యంగా 2024 లో కియా మోటార్స్ అమ్మకాల్లో సోనెట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎక్కువగా అమ్ముడుపోయింది. దాదాపు ఇది 9,459 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా కేరెన్స్ మోడల్ 5,679, సెల్టోస్ 5347 యూనిట్ల అమ్మకాలను సాధించాయి.
'మేక్ ఇన్ ఇండియా' వాహనాలకు బలమైన డిమాండ్‌తో కియా ఇండియా దేశీయ విక్రయాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. కంపెనీ అంతర్జాతీయంగా భారత్‌లోని తన ప్లాంట్ల ద్వారా జులై 2024లో 2,500 యూనిట్లను ఎగుమతి చేసింది. వీటిలో సెల్టోస్ 932 యూనిట్లు, సోనెట్ 740, కారెన్స్ 833 యూనిట్లు ఉన్నాయి. వాహన్ డేటా ప్రకారం, జులై 2024లో మొత్తం పరిశ్రమ వృద్ధి సగటున 9 శాతం కాగా, కియా ఇండియా మోటార్స్ కంపెనీ 26 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం.