HBO సినిమాలు, సిరీస్‌లు ఇక జియో సినిమాలో చూడొచ్చు!

by Harish |
HBO సినిమాలు, సిరీస్‌లు ఇక జియో సినిమాలో చూడొచ్చు!
X

న్యూఢిల్లీ: ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో ఒప్పందం నుంచి బయటకు వచ్చిన వార్నర్ బ్రదర్స్, హెచ్‌బీఓతో రిలయన్స్‌కు చెందిన వయాకామ్18తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్‌కు చెందిన పలు సూపర్‌హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో సినిమాలో అందుబాటులోకి రానున్నాయి. త్వరలో భాగస్వామ్యంలో భాగంగా ఇరు సంస్థలు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

హెచ్‌బీఓ, వార్నర్ బ్రదర్స్‌కు చెందిన లక్షల గంటల టీవీ షోలు, స్పోర్ట్స్, సినిమా జియో సినిమా ప్లాట్‌ఫామ్‌లో చూడవచ్చు. ఇటీవల ఉచితంగా ఐపీఎల్ ప్రసారాలను ఇవ్వడం ద్వారా జియో సినిమా ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు పోటీనిచ్చింది. తాజా ఒప్పందంతో పోటీ మరింత తీవ్రం కానుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Next Story