Jio వాలెంటైన్స్ డే ఆఫర్.. భారీ తగ్గింపులు, ఉచితంగా మెక్‌డొనాల్డ్స్‌ ఫుడ్

by Harish |   ( Updated:2023-02-14 04:13:16.0  )
Jio  వాలెంటైన్స్ డే ఆఫర్.. భారీ తగ్గింపులు, ఉచితంగా మెక్‌డొనాల్డ్స్‌ ఫుడ్
X

దిశ, వెబ్‌డెస్క్: వాలెంటైన్స్ డే సందర్బంగా రిలయన్స్ జియో తన ప్లాన్లపై అదనంగా కొన్ని ప్రోత్సాహకాలను అందిస్తుంది. రూ.349, రూ.899, రూ.2,999 ప్లాన్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఇప్పటికే ఉన్న ప్రయోజనాలతో పాటు కాంప్లిమెంటరీ వోచర్‌లు లభిస్తాయి. డేటా వోచర్‌లు, విమాన టిక్కెట్ బుకింగ్‌లో రాయితీలు, ఉచితంగా బర్గర్ మొదలగునవి లభించనున్నాయి. రూ. 4500 విలువ కలిగిన విమాన టిక్కెట్ బుకింగ్‌లపై రూ. 750 తగ్గింపు, ఫెర్న్స్ అండ్ పెటల్స్‌పై కనీసం రూ. 799 పైగా కొనుగోలు చేసే కొనుగోలుదారులు రూ. 150 తగ్గింపును పొందుతారు. మెక్‌డొనాల్డ్స్‌లో రూ. 199 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే రూ. 105 విలువైన చికెన్ కబాబ్ లేదా మెక్‌ఆలూ టిక్కీ బర్గర్‌ను కూడా ఉచితంగా పొందుతారు. వినియోగదారులు పూర్తి వివరాల కోసం MyJio యాప్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి : అమెజాన్‌లో 78 శాతం తగ్గింపుతో వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్

Advertisement

Next Story