బీమా వ్యాపారంలోకి అడుగు పెట్టనున్న జియో ఫైనాన్షియల్!

by Harish |   ( Updated:2023-07-31 15:15:59.0  )
బీమా వ్యాపారంలోకి అడుగు పెట్టనున్న జియో ఫైనాన్షియల్!
X

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్(జేఎఫ్ఎస్) భవిష్యత్తులో బీమా సేవలు అందించనుంది. కంపెనీ సాధారణ, జీవిత బీమా వ్యాపారంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. అందుకోసం దేశీయ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతుల కోసం దరఖాస్తు చేసే ప్రయత్నాల్లో ఉంది. అవసరమైన ప్రక్రియ అనంతరం 2024 నుంచి బీమా సేవలు అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, అన్ని ప్రక్రియలు ముగిసిన తర్వాత తుది ఆమోదం పొందేందుకు 6-8 నెలల సమయం పట్టవచ్చు.

ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి వేరైన జేఎఫ్ఎస్ కంపెనీ ఈ మధ్యే అమెరికాకు చెందిన అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థ బ్లాక్‌రాక్‌తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది దేశంలో లక్షలాది మంది పెట్టుబడిదారులకు సరసమైన, భిన్నమైన పెట్టుబడి పరిష్కారాలను అందించనుంది.

ఈ క్రమంలోనే కంపెనీ బీమా రంగంలోకి కూడా ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, ఈ వార్త వెలువడిన నేపథ్యంలో సోమవారం స్టాక్ మార్కెట్లలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్ ధర 1.86 శాతం, ఎస్‌బీఐ లైఫ్ షేర్ అరశాతం క్షీణించాయి.

Advertisement

Next Story

Most Viewed