Jio Financial: జియో పేమెంట్స్‌కు అగ్రిగేటర్ లైసెన్స్.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ

by Maddikunta Saikiran |
Jio Financial: జియో పేమెంట్స్‌కు అగ్రిగేటర్ లైసెన్స్.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ
X

దిశ,వెబ్‌డెస్క్: భారతదేశ ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani)కి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(RIL) ఇటీవలే ఫైనాన్స్(Finance) రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. జియో ఫైనాన్సియల్ సర్వీసెస్(Jio Financial Services)కు చెందిన జియో పేమెంట్స్ సొల్యూషన్స్ లిమిటెడ్(JPSL) ఆన్‌లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్ గా కంటిన్యూ అయ్యేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వద్ద గత నెల అప్లై చేసుకోగా తాజాగా ఆమోదం లభించింది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం తన స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్(Stock Exchange Filing)లో తెలిపింది. అక్టోబర్ 28 నుంచి సర్టిఫికేషన్ చెల్లుబాటు అవుతుందని సంస్థ వెల్లడించింది. కాగా జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ కు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ సంస్థ షేర్లు ఈ రోజు రాణించాయి. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ(NSE)లో రూ. 323 వద్ద ట్రేడవుతోంది.

మరోవైపు ధన్‌తేరస్(Dhanteras) సందర్భంగా ఆ సంస్థ కొత్త సర్వీసులను స్టార్ట్ చేసింది. జియో ఫైనాన్స్ యాప్(Jio Finance App) ద్వారా కస్టమర్లు డిజిటల్ గోల్డ్(Digital Gold) కొనుగోలు చేసేందుకు 'స్మార్ట్ గోల్డ్(Smart Gold)' సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయొచ్చని సంస్థ తెలిపింది. ఇందులో రూ. 10 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చని పేర్కొంది. కావాలంటే డిజిటల్ గోల్డ్ ను నగదు రూపంలో లేదా ఫిజికల్ గోల్డ్ గా మార్చుకోవచ్చని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed