తక్కువ ధరకు కొత్త రకం ప్రీమియం డీజిల్ తెచ్చిన జియో-బీపీ!

by Harish |
తక్కువ ధరకు కొత్త రకం ప్రీమియం డీజిల్ తెచ్చిన జియో-బీపీ!
X

ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద చమురు రిఫైనింగ్ కాంప్లెక్స్ కలిగిన దేశీయ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభుత్వ ఇంధన హోల్‌సేలర్‌ల కంటే తక్కువ ధరకు డీజిల్‌ను విక్రయిస్తోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటీష్‌ ఇంధన దిగ్గజం బీపీల సంయుక్త సంస్థ జియో-బీపీ ప్రీమియం డీజిల్‌ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ ఇంధన సంస్థలు విక్రయించే సాధారణ డీజిల్ కంటే తక్కువకు లభిస్తుంది. ఇది మెరుగైన మైలేజీని ఇస్తుందని, ట్రక్కుకు రూ. 1.1 లక్షల వరకు ఆదా చేస్తుందని కంపెనీ తెలిపింది.

దేశీయ వినియోగదారుల కోసం డీజిల్ ప్రమాణాలను పెంచుతూ యాక్టివ్ టెక్నాలజీతో ఈ డీజిల్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. కొత్తగా విడుదల చేసిన డీజిల్ జియో-బీపీ నెట్‌వర్క్ పరిధిలో ఉన్న అన్ని ఔట్‌లెట్లలో ఉంటుందని, ఇతర డీజిల్ కంటే ఇది 4.3 శాతం మెరుగ్గా ఉంటుందని కంపెనీ వివరించింది. కాగా, ముంబైలోని జియో-బీపీ ఔట్‌లెట్లలో కొత్త ప్రీమియం డీజిల్ ధర లీటర్ రూ. 91.30 ఉండగా, ఇతర ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల వద్ద సాధారణ డీజిల్ రూ. 92.28గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed